మహిళా,శిశు సంక్షేమంపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ సీఎం జగన్ మహిళా,శిశు సంక్షేమశాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యంగా బాలింతలు,గర్భిణిల్లో రక్తహీనత నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. చిన్నారులలో పౌష్టికాహార లోపాన్ని నివారించే విధంగా తగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీల ద్వారా నాణ్యమైన ఆహరం అందిస్తున్నామన్నారు. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌లు రూపొందిస్తుందన్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీల రూపురేఖలు మార్చాలన్నారు. ఆహారంలో క్వాలీటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. టాయిలెట్ల శుభ్రతపైనా దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అంగన్‌వాడీలను పర్యవేక్షించేందుకు రూపొందించే యాప్‌లలో డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. ఈ డేటా ద్వారా అంగన్‌వాడీలలో తలెత్తే సమస్యలను గుర్తించాలన్నారు. అంతేకాకుండా వీటిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.