Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు : నారా లోకేష్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్మాదిలా మారి తమ అధినేత చంద్రబాబుపై రోజుకు ఒక తప్పుడు కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పిచ్చి చివరి దశకు చేరనున్న నేపథ్యంలో సీఎం కుర్చీలో ఉండటానికి జగన్ అనర్హుడని ఆయన అన్నారు. దిగజారిన జగన్ మానసిక స్థితిపై గవర్నర్ జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పై రోజుకు ఒక తప్పుడు కేసు పెడుతున్న సీఎం జగన్ కి పిచ్చి బాగా ముదిరిపోయిందని జనం చర్చించుకుంటున్నారన్నారు. కక్షతో రగిలి పోతున్న ఆయన నైజం ఏంటో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైంది అన్నారు. సీఎం స్థానంలో ఉండి ఉన్మాదిలా మారి సిఐడిని వైసీపీ అనుబంధ విభాగంగా మార్చుకున్నారని దుయ్య పట్టారు. చంద్రబాబుపై ఆధారాలు లేని తప్పుడు కేసులు వరుసగా బనాయించడం చూసిన జనం సీఎం జగన్ కు పిచ్చి బాగా ముదిరిపోయిందని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.