Andhra PradeshNews

వైసీపీ మంత్రులపై సీఎం జగన్ సీరియస్

ఈ రోజు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 57 అంశాలకు సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో  చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా సచివాలయంలో 85 కొత్త పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయటానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువంటి కీలక నిర్ణయాలు,చర్చలతో నేటి ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.

ఈ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం జగన్ మంత్రులతో భేటి అయ్యారు. ఈ భేటిలో ఆయన వైసీపీ మంత్రులకు కొన్ని సూచనలు,హెచ్చరికలు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. మంత్రులందరు ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలన్నారు. ప్రతిపక్షాలకు ఎప్పటికప్పుడు సరైన కౌంటర్ ఇవ్వాలని సీఎం మంత్రులను ఆదేశించారు. ఈ విధంగా చెయ్యని పక్షంలో మంత్రులను మార్చడానికి కూడా తాను వెనుకాడబోనని సీఎం జగన్ హెచ్చరించారు. మన ప్రభుత్వం చేస్తున్న పనులపై విపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎందుకు తిప్పికొట్టలేక పోతున్నారని సీఎం జగన్ మంత్రులను ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే అందరి బాధ్యతని ..నాకేం పట్టిందిలే అన్నట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.