శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మహా పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనాలతో స్వాగతం సీఎంకు స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు చేకూరాలని తలపెట్టిన మహా తపస్సు భారీ విజయవంతమైందని పూర్ణాహుతి సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలు, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ రకమైన యాగ తపస్సు చేయడం దేశంలోనే ఇదే మొదటిదిగా నిలిచిందన్నారు.

అభిషేక మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పట్టుచీర సమర్పించిన సీఎం జగన్.
ఈ సందర్భంగా దీక్ష, యాగ ఫలం రాష్ట్ర ప్రజలకు మరింత మంచి చేయాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. సీఎం జగన్ సంకల్పంతో మొదటిసారిగా దేవాదయ శాఖ 6 రోజుల పాటు సాగిన యాగం నేడు సీఎం జగన్ చేత పూర్ణాహుతి దీక్షతో ముగిసినట్లు పండితులు పేర్కొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో వివిధ పీఠాధిపతులతోపాటుగా మంత్రులు తానేటి వనిత, విద్యాశాఖ సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు.



 
							 
							