Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ ఓ చేతకాని దద్దమ్మ:చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఏలూరులో పర్యటించారు. కాగా ఏపీలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. అకాల వర్షాల సమయంలో 60% ధాన్యం పొలాల్లోనే ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఓ చేతకాని దద్దమ్మ సీఎంగా ఉంటే రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి తప్పదని చంద్రబాబు సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లో కూడా రైతులను పరామర్శించేందుకు సీఎం ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలపై బాధ్యత  లేని ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనన్నారు. ఇప్పటివరకు రైతులకు ధాన్యం సంచులు ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఏమనాలన్నారు. సీఎంగా అధికారం చేపట్టినప్పటి నుంచి జగన్ ఎప్పుడైనా పంట పొలంలోకి దిగారా అని జగన్‌ని చంద్రబాబు దుయ్యబట్టారు.