పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం జగన్
సీఎం జగన్ ఇవాళ ఉదయం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. కాగా సీఎం ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. మొదటగా సీఎం పోలవరం పనుల పురోగతిపై ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను నిశితంగా పరిశీలన చేశారు. కాగా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పూర్తైన పనుల వివరాలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే మరికాసేపట్లో పోలవరం పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా కేంద్రం నుంచి త్వరలోనే పోలవరానికి నిధుల రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి చేయడంపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.