Andhra PradeshHome Page Slider

ఏపీలో 3,295 ఉద్యోగాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. ఏపీలో భారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతి లభించింది. 3,295 ఉద్యోగాల భర్తీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వర్సిటీలు, ట్రిపుల ఐటీలలో పోస్టులు భర్తీ చేయడానికి ఆమోదముద్ర వేశారు. వర్సిటీలో 2,635 పోస్టులు, ట్రిపుల్ ఐటీలలో 660 పోస్టుల భర్తీకి అనుమతించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. నవంబర్ 15 లోగా ఈ నియామకాలు పూర్తి కానున్నాయని సమాచారం. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నదని తెలియజేశారు.