Andhra PradeshNews

ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే.. గురువులు మనకు భవితనిస్తారని తెలిపారు. అంతేకాకుండా పిల్లలకు జ్ఞానాన్ని పంచి నడత నేర్పేవారు గురువులే అని కొనియాడారు. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా  ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని… రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేస్తామన్నారు. అయితే ఏపీలో ఇప్పటికే సీఎం జగన్ ఉపాధ్యాయులకు పెట్టిన పలు ఆంక్షల వల్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నుంచి వారు ఏమి డిమాండ్ చేస్తారో చూడాల్సివుంది.

Read more : అర్షదీప్ క్యాచ్ వదిలేశాడు.. రోహిత్ శర్మ కేకలు పెట్టాడు