ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆయన భారీ గణేషుడు నిమజ్జనం జరగబోయే క్రేన్ నెంబర్ 4 వద్దకు వెళ్లి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌పై గణేషుల నిమజ్జనాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ప్రశాంతంగా గణేష నిమజ్జనాలు జరిగేలా పూర్తి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మహా గణపతి నిమజ్జనానికి హాజరయిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు. 350 టన్నుల బరువు ఎత్తగలిగే సూపర్ క్రేన్‌ను శంషాబాద్ నుండి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్దకు చేరుకున్నారు ఖైరతాబాద్ గణపతి. ఒంటిగంట నుండి నిమజ్జన ప్రక్రియ ప్రారంభం కానుంది.