Home Page SliderNational

అసెంబ్లీలో నిద్ర పోయిన సీఎం..

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అసెంబ్లీ చర్చ సమయంలో సీఎం నిద్రిస్తున్నట్లు ఉన్న వీడియోను షేర్ చేసింది. ‘వీరు ఢిల్లీని ముందుకు తీసుకెళ్తారా..?’ అని రాసుకొచ్చింది. ‘ఢిల్లీ బాగోగులు చూడటానికి ప్రజలు ఆమెను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. ఆమె నిద్ర పోతున్నారు’ అని బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.