ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్..
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎస్, డీజీపీ, సీపీ, పోలీస్ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తున్నారు. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. స్థానికంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రక్షణ విభాగాలకు వ్యూహాత్మక కేంద్రంగా హైదరాబాద్ మారింది.

