టీమిండియా క్రికెటర్లను సన్మానించిన సీఎం ఏక్‌నాథ్ షిండే
టీమిండియా క్రికెటర్లు దాదాపు 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్‌ను సాధించారు. దీంతో దేశవ్యాప్తంగా టీమిండియా క్రికెటర్లకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నిన్న ప్రధాని మోదీ టీమిండియా క్రికెటర్లను కలిసి అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ టీమిండియాలోని మహరాష్ట్రకి చెందిన క్రికెటర్లను అభినందించారు. ఈ మేరకు టీమిండియా విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మకు శాలువా కప్పి సీఎం సన్మానించారు.అయితే హిట్ మ్యాన్‌తోపాటు సూర్యకుమార్ యాదవ్,శివమ్ దూబే,యశస్వీ జైస్వాల్‌ను సీఎం ఏక్‌నాథ్ షిండే అభినందించి సన్మానించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

