Home Page SliderNational

సీఎంకు మళ్లీ నిరాశే..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆయన కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. అయితే… ఇవాళ విచారణ సందర్భంగా సీబీఐ కావాలనే కౌంటర్ దాఖలు చేయడం లేదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలిపారు. అయితే.. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలంటూ సీబీఐ కోర్టును కోరింది. ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐకి మరో వారం రోజుల పాటు గడువు ఇస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.