Andhra PradeshHome Page Slider

చంద్రబాబు సభలో ‘సీఎం, సీఎం’ అంటూ నినాదాలు

మంగళగిరిలోని మహిళా మహాశక్తి సభలో చంద్రబాబును సీఎం, సీఎం, అంటూ నినాదాలు చేశారు ప్రజలు. మహిళా శక్తిని తక్కువ అంచనాలు వేయొద్దని, వారికి మగవారి కంటే ఎక్కువ తెలివితేటలుంటాయని మంగళగిరిలో నిర్వహించిన మహాశక్తి ప్రచార కార్యక్రమంలో చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల ప్రోత్సాహకం కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసిందని, ఇప్పుడు మహిళలలు మగవారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని అన్నారు. ఒకప్పటితో పోలిస్తే కుమార్తె పెళ్లి గురించి, కట్నాల గురించి ఆలోచించేవారి సంఖ్య తగ్గిందన్నారు. చదవుకోని మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు శక్తిని పెంచామన్నారు. మహిళల పేరుతో తమ ప్రభుత్వ హయాంలో డబ్బులు డిపాజిట్లు చేశామన్నారు. మహిళలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. స్పీకర్‌గా మహిళలకే అవకాశం ఇస్తున్నామన్నారు. సభ ప్రారంభంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి, నమస్కరించారు చంద్రబాబు.