సీఎం మార్పు ఒట్టిదే
సీఎం రేవంత్ రెడ్డిని త్వరలోనే మారుస్తున్నారంటూ బీ.ఆర్.ఎస్.,బీ.జె.పి చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రమూ నిజం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.మీడియాలో వస్తున్న కథనాల పట్ల ఆయన శుక్రవారం గాంధీభవన్ దగ్గర మీడియాతో చిట్ చాట్ చేశారు.తాను సీఎం రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు.మంత్రి పదవులు,ముఖ్యమంత్రి పదవులు అన్నీ ఢిల్లీ పెద్దలే చెప్పాలని అంతే కాని ఎవరికి వారు ఊహాలోకంలో ఉండటం మంచిది కాదన్నారు.సీఎంని ఎట్టి పరిస్థితుల్లో మార్చబోరని ఆయన తేల్చి చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రజామోదయోగ్యమైన పాలన అందిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

