Andhra PradeshHome Page Slider

అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు నేడు అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం ఇప్పటికే అనకాపల్లి చేరుకున్నారు.కాగా అక్కడ సీఎంకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు,హోంమంత్రి వంగలపూడి అనిత,ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో సీఎం మరి కాసేపట్లో దార్లపూడి దగ్గర పోలవరం ఎడమ కాలువను పరిశీలించనున్నారు. కాగా మధ్యహ్నం సీఎం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి..పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సీఎం సీఐఐ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. ఆ తర్వాత మెడ్‌టెక్ జోన్ వర్కర్లతో సీఎం సమావేశమవుతారు.ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో అధికారులతో సమావేశమై..గత ప్రభుత్వ పాలనలో నిలిచిపోయిన పలు ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై సమీక్షిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.