Andhra PradeshHome Page Slider

రాష్ట్ర విభజనలో ఏపీకి నష్టం జరిగిందన్న సీఎం చంద్రబాబు

ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు గత రెండు రోజుల నుంచి పలు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రాష్ట్ర విభజనలో ఏపీకి నష్టం జరిగిందన్నారు.కాగా ఏపీలో 56 శాతం జనాభా ఉంటే 46శాతం మాత్రమే ఆదాయం వచ్చిందన్నారు.అయితే కంపెనీలు,ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. కాగా ఏపీలో పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడంతోనే ఆదాయం తగ్గిపోయిందని సీఎం పేర్కొన్నారు. అయితే  విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని సీఎం చంద్రబాబు వెల్లడించారు.