Andhra PradeshHome Page Slider

మద్యం పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు మద్యం పాలసీపై ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీలో మద్యపానాన్ని నిషేదిస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న 4380 మద్యం షాపులను 2934కు తగ్గించి..మళ్లీ 3392కు పెంచారని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం రాష్ట్రంలో 38 రకాల కొత్త బ్రాండ్‌లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కాగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసేసి లోకల్ బ్రాండ్‌లను తీసుకు వచ్చిందన్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడిందని సీఎం ఆరోపించారు. అయితే గత ప్రభుత్వం మద్యం ధరలను కూడా 75 శాతం పెంచిందన్నారు.దీంతో టాప్ 5 బ్రాండ్ సేల్స్ గణనీయంగా తగ్గాయన్నారు. కాగా 2014-2019లో ఏపీలో డిమాండ్ మేరకు సరఫరా జరిగిందన్నారు. అయితే 2019-2024లో కొందరి కనుసన్నల్లో సరఫరా జరిగిందని సీఎం తెలిపారు.