Andhra PradeshHome Page Slider

నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయ్యారు.ఈ భేటీలో చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల కేటాయింపుపై కూడా చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.అయితే గత 2 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా,పియూష్ గోయల్ ,నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు.