వివేకా హత్యపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
మహానాడు కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘గుండెపోటుతో వివేకా చనిపోయారని వార్తలు వచ్చినప్పుడు నేనూ నమ్మాను. గొడ్డలితో దారుణంగా చంపేసి.. రక్తాన్ని కడిగేసి ఏమీ జరగనట్లు గుండెపోటు అని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నామనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నారాశుర రక్త చరిత్ర అంటూ నా మీదే నిందలు వేశారు’’ అని పేర్కొన్నారు.

