మోదీ డిగ్రీ పత్రాలు అడిగిన సీఎం..జరిమానా విధించిన హైకోర్టు
ఇటీవల కాలంలో ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ప్రధాని నరేంద్ర మోదీ తాను చదివిన డిగ్రీ సర్టిఫికెట్లను చూపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల వివరాలను అందించాలని RTI ద్వారా కోరారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కోరిన విధంగా వివరాలివ్వాలని గుజరాత్ ,ఢిల్లీ యూనివర్సిటీలను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశించింది. అయితే ఈ వివరాలను ఎవరికీ తెలపాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాగా ఈ వివరాలు ఇవ్వాలని కోరినందుకుగాను గుజరాత్ హైకోర్టు కేజ్రివాల్‌కు రూ.25,000/- రూపాయల జరిమానా విధించింది.