గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా సీఎం..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ తో కలిసి తెరకెక్కించిన భారీ సినిమా గేమ్ ఛేంజర్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్లోబల్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా చెన్నై, ముంబై, కొచ్చి, తదితర నగరాలతోపాటూ హైదరాబాద్ లో భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు.న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే ఈవెంట్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చేందుకు మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే రామ్ చరణ్ కుటుంబానికి రేవంత్ రెడ్డి తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే సీఎం రేవంత్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించనున్నారని సమాచారం. మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

