Home Page SliderTelangana

పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్.. ఆరుగురు అరెస్ట్!

తెలంగాణలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. పరీక్ష పేపర్ల లీక్ల పర్వం మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట ప్రశ్నపత్రం లీక్ అవుతూనే ఉంది. తాజాగా పరీక్షలు ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నాపత్రం లీకైంది. ఈనెల 21న నల్గొండ జిల్లా నకిరేకల్ గురుకులంలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఎగ్జామ్ మొదలైన కాసేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు తాజాగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్ ను విధుల నుంచి తొలగించారు. ఇదే కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.