బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. భూంపల్లి అక్బర్ పేట్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. తమ కృషి వల్లే భూంపల్లి అర్బర్ పేట్ మండలం ఏర్పాటు అయిందని రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు. రఘునందన్‌రావు కృషితోనే మండలం, తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటు అయిందని బీజేపీ కార్యకర్తలు అన్నారు. కార్యకర్తల నినాదాలతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తహశీల్దార్ ఆఫీస్ ప్రారంభోత్సవం తర్వాత ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు అభిమానులు పాలాభిషేకం చేశారు.