తిరంగా ర్యాలీలో ఘర్షణ.. మీడియా ప్రతినిధులకు గాయాలు..
తెలంగాణలోని ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల ఘర్షణలో మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇల్లందు క్రాస్ రోడ్డులో బీజేపీ నాయకుల తిరంగా ర్యాలీని అడ్డుకున్నారని దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. దీంతో అక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ భారీగా నాయకులు తరలివచ్చారు. తిరంగా ర్యాలీని అడ్డుకోవడం కోసం ప్రయత్నించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. ఖమ్మం నగరంలో జరిగిన దాడికి నిరసనగా ఖమ్మం సిటీ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చారు.