Home Page SliderNational

ఢిల్లీలో పవర్ సబ్సిడీ ఎత్తేసిన ఆప్ -గవర్నర్‌తో గొడవ

ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు సబ్సిడీ ఈ రోజు నుండి అందించలేకపోతున్నామన్నారు ఆప్ విద్యుత్ శాఖా మంత్రి అతిష్. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఫ్రీ బిల్లును ఆమోదించలేదని అందుకే ఉచిత కరెంట్‌కు అంతరాయం ఏర్పడిందని ఆయన చెప్పారు. 46 లక్షల మందికి పైగా ఈ సబ్సిడీని పొందుతున్నారని… గవర్నర్ కొన్ని బిల్లులతోపాటుగా, ఉచిత విద్యుత్ బిల్లును పెండింగులో పెట్టారని, అసెంబ్లీ ఆమోదించిన ఈ పవర్ బిల్లును ఆమోదించట్లేదని ఆప్ దుయ్యబట్టింది. దీనికి ఎల్జే కార్యాలయం కూడా దీటుగా సమాధానమిచ్చింది. ఈ బిల్లును కేవలం మూడురోజుల ముందు పంపించారని, ఏప్రిల్ 4 చివరి తేదీ అయితే ఈ బిల్లును ఏప్రిల్ 11 వరకు గవర్నర్ సమక్షానికి పంపించలేదని.. అసలు విషయాన్ని వెల్లడించింది. ఆప్ ప్రభుత్వం రాజకీయాలు చేయడానికే ఇలాంటి పనులకు పాల్పడుతోందని, ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని ఎల్జే ఆఫీసు విరుచుకుపడింది.