కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యే అనుచరుల మధ్య కొట్లాట
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో ఎంఐఎం, కాంగ్రెస్ నేతల మధ్య గొడవ ముదిరి కొట్లాటకు దిగింది. ఎమ్మెల్యే సాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరులు తీవ్రస్థాయిలో కొట్లాడుకున్నారు. ఇరు వర్గాలు పిడిగుద్దులతో నడిరోడ్డుపై యుద్ధం చేశారు. సీసీ రోడ్ల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ రాగా నాంపల్లి ఎమ్మెల్యే అనుచరులు ఆయనను అడ్డుకున్నారు. దీనితో ఫిరోజ్ ఖాన్ అనుచరులు కూడా తిరగబడ్డారు. దీనితో స్ట్రీట్ ఫైట్ మొదలయ్యింది.