యంగ్ టైగర్ బాలీవుడ్ ‘ఎంట్రీ’పై క్లారిటీ
యంగ్ టైగర్ ‘జూనియర్ ఎన్టీఆర్’ త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సూపర్ హిట్ ఆస్కార్ విన్నింగ్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ తో తారక్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో తారక్ హీరోగా పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. స్వచ్ఛమైన డైలాగ్ డెలివరీ, సూపర్ డాన్సింగ్ స్కిల్స్, కష్టపడే తత్వం, ఎన్టీఆర్‌ను అగ్రస్థాయిలో నిలబెట్టాయి.

ఇప్పుడు బాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. తన రాబోయే మల్టిస్టారర్ చిత్రం వార్- 2లో ఎన్టీఆర్‌తో కలిసి ఎప్పుడు నటిస్తానా అని ఎదురుచూస్తున్నానని, మొన్న మే 20 ఎన్టీఆర్ బర్తడేకి విష్ చేస్తూ ట్విటర్‌లో వెల్లడి చేశారు. గ్రాండ్ లెవెల్లో జూనియర్ బాలీవుడ్ ఎంట్రీ ఉండబోతోందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. వార్ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి స్క్రీన్ పంచుకున్నారు. దీనిలో హృతిక్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే, టైగర్ పోలీస్ పాత్ర చేశాడు. అయితే వార్ -2లో ఇది రివర్స్ కావచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ నెగెటివ్ పాత్ర చేయబోతున్నాడని, హృతిక్ పోలీస్ కాప్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. తారక్ ఏపాత్ర ఇచ్చినా ఇరగదీసేస్తాడని అభిమానుల నమ్మకం.