తెనాలిపై ఆలపాటి క్లారిటీ… పొత్తు తప్పదని సంకేతాలు
తెనాలి అసెంబ్లీ సీటు విషయంలో వివాదం లేదన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజా. సీటు విషయంలో అసలు సమస్యే లేదన్నారు. కార్యకర్తల్లో ఉద్వేగపూరితమైన వాతావరణం ఉంటుందని అది సందర్భోచితంగా ఉంటుందని.. అదే పోతుందని అన్నారు. వాటిని కార్యకర్తల మనోభావాలుగా చూడాలన్నారు. పొత్తు అనివార్యమని.. తాను పొత్తును స్వాగతిస్తున్నానన్నారు. సీట్ల వ్యవహారాన్ని పెద్దలు నిర్ణయిస్తారన్నారు. కార్యకర్తలు మనోభావాలను మరోలా తెలియజేస్తే బాగుంటుందన్నారు. కష్టపడ్డామన్న భావనతో బహిరంగ వ్యాఖ్యలు చేయరాదన్నారు.

