రాంచరణ్ గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్‌పై క్లారిటీ
రాంచరణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న గేమ్‌ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, కోనసీమ భామ అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్ హ్యాష్‌ట్యాగ్‌తో కూడిన స్టిల్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. గేమ్ ఛేంజర్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం రెండో పాట సూపర్ స్టైలిష్‌గా వచ్చిందని, త్వరలోనే సందడి చేయబోతుందని థమన్ హింట్ ఇచ్చేసినట్టు అర్థమవుతోంది. మరి సెకండ్ సింగిల్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. శంకర్ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాబోతున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కథానుగుణంగా రాంచరణ్ తండ్రీకొడుకులుగా (డబుల్ రోల్) ప్లే చేస్తూ తెరపై కనువిందుచేయబోతున్నారని ఒక టాక్ పరిశ్రమ వర్గాల్లో వినపడుతోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.