Home Page SliderNational

‘కాంతారా’ మూవీ సీక్వెల్‌పై క్లారిటీ

2022లో చిన్న చిత్రంగా వచ్చి ఆస్కార్ నామినేషన్ వరకూ పరుగులు పెట్టింది కన్నడ చిత్రం ‘కాంతారా’.దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించి పాన్ ఇండియా మూవీగా మారిపోయింది. కాంతారా చిత్ర హీరో ‘రిషబ్ షెట్టి’ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుని వందలకోట్లు సంపాదించింది. దీనితో ఈ చిత్రానికి సీక్వెల్ కావాలంటున్నారు అభిమానులు. దీనితో వారి ఆశలను గమనించి, ‘కాంతారా 2’ ని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు మేకర్స్. ఈ చిత్రం సీక్వెల్‌కు కథ లాక్ చేశారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వచ్చే జనవరిలో ఈచిత్రాన్ని విడుదల చేస్తారని చెపుతున్నారు. దీనిని ప్రీక్వెల్ అంటున్నారు. అంటే ‘కాంతారా 1’ కంటే ముందు కథ అయ్యింటుందని సమాచారం.