ఏఐ లాయర్‌తో సీజేఐ చంద్రచూడ్ ముచ్చట్లు
సుప్రీంకోర్టులో నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్. అక్కడ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే వర్చువల్ లాయర్‌తో ముచ్చటించారు. ఈ క్రమంలో మరణశిక్ష చట్టబద్దమేనా? అంటూ వర్చువల్ లాయర్‌ను ప్రశ్నించారు. దీనికి ఏఐ లాయర్ ఇచ్చిన సమాధానం సీజేఐను మెప్పించింది. భారత్‌లో మరణశిక్ష చట్టబద్దమేనని, అత్యంత ఘోరమైన నేరాలలో సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇస్తుందని బదులిచ్చింది. నల్లకోటు, కళ్లజోడు ధరించి లాయర్ రూపంలో జవాబులిస్తున్న ఏఐ లాయర్ అందరినీ ఆకట్టుకున్నారు.