అమెరికాలో మారనున్న సిటిజన్ షిప్ రూల్స్
నూతన అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ఇకపై అమెరికాలో సెటిల్ అవ్వడం అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే వలస చట్టంపై తొలి సంతకం పెడతానని ట్రంప్ మాట ఇచ్చారు. ఈ ప్రకారం అమెరికా వెళ్లిన దంపతులకు పిల్లలు పుడితే వారికి వెంటనే సిటిజన్ షిప్ రాదు. ఇప్పటివరకూ అమెరికాలో ద్విపౌరసత్వం అమల్లో ఉంది. దీనిప్రకారం అక్కడ పుట్టిన బిడ్డలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభిస్తుంది. దీనిప్రకారం హెచ్1బీ, ఎఫ్1 వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేసేవారికి, వారి కుటుంబాలకు పౌరసత్వం వచ్చే అవకాశం లేదు. అక్కడ పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రులలో ఎవరికైనా గ్రీన్ కార్డు కానీ, అమెరికా సిటిజన్ షిప్ కానీ ఉండాలి. ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం 12 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. దీనితో అమెరికాలో స్థిరపడాలనుకున్న భారతీయుల ఆశలు అడియాసలయినట్లే.