Home Page SliderTelangana

సినిమా పెద్దలు కాదు గద్దలు వీళ్లు

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ అరెస్టు, బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల ధరల పెంపు ఉండదన్న ప్రభుత్వ ప్రకటనతో దిగివచ్చిన సినీ ఇండస్ట్రీ పెద్దలు నేడు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ బయట కామన్ మ్యాన్ పేరుతో ఓ వ్యక్తి చేసిన హల్ చల్ చర్చనీయాంశమైంది. ‘సినిమా పెద్దలు కాదు గద్దలు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ కామన్ మ్యాన్ అని చెప్పుకున్న ఓ వ్యక్తి సినిమా షోలపై టికెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తమ వాదనను, సమస్యలను కూడా సీఎం వినాలని అతడు కోరాడు.