Andhra PradeshHome Page Slider

“మద్యం పాలసీలో జరిగిన అవినీతిపై సీఐడీ విచారణ చేపడతాం”:సీఎం చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీపై సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా 2019-2024లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంపై సీఐడీతో విచారణ చేయిస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. కాగా మద్యం పాలసీలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న పవన్ విజ్ఞప్తిపై సీఎం సభలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మద్యం పాలసీపై సీఐడీ విచారణలో వాస్తవాలు తేలుస్తామన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీలో మొత్తం నగదు లావాదేవీలు జరిపిందన్నారు.అయితే దీనిపై ఈడీకీ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా  మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.