ఏపీ డిస్టలరీలలో సీఐడీ సోదాలు
ఏపీ డిస్టలరీలలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లాలలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 30 ప్రాంతాలలో సోదాలు చేస్తున్నారు. మద్యం అమ్మకాలలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రతీ జిల్లాలో ముఖ్యమైన తయారీ కేంద్రాలలో తనిఖీలు చేస్తున్నారు. గత నెలలో కొన్ని దుకాణాలలో తనిఖీలు చేసి, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజెస్ ఎండీపై నమోదయిన కేసు ఆధారంగా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బ్రాండ్, క్వాలిటీ, రేట్లు వంటి విషయాలలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బిల్లులలో అక్రమాలు జరిగాయన్నారు. మరో రెండు రోజుల పాటు ఈ తనిఖీలు జరుగుతాయని సమాచారం.