Andhra PradeshHome Page SliderPolitics

నటుడిపై సీఐడీ కేసు

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీలో సీఐడీ కేసు నమోదయ్యింది. సెప్టెంబరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ కేసు నమోదు చేశారు. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ చేసిన ఫిర్యాదుపై కేసును నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవినే కించపరిచేలా ఉన్నాయని, వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడారని పోసానిపై చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.