సీఐడీ బాస్ సునీల్ కుమార్ ట్రాన్స్‌ఫర్
ఏపీ సీఐడీ అదనపు డీజీగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ ఎన్ సంజయ్‌ను నియమించింది. సీఐడీ అదనపు డీజీగా నియమితులైన సంజయ్ ప్రస్తుతం విపత్తు నిర్వహణ డీజీగా వ్యహరిస్తున్నారు. తాజాగా బదిలీ అయిన సునీల్ కుమార్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఐపీఎస్ బదిలీల్లో భాగంగా సునీల్ కుమార్ ట్రాన్స్‌ఫర్ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్య కేసుల విచారణ కీలక దశలో ఉన్నప్పుడు సునీల్ కుమార్ బదిలీ ఎలాంటి ప్రభావం చూపెడుతోంది చూడాల్సి ఉంది.
