మిస్ వరల్డ్ అందాలరాణులతో మెరిసిపోయిన ‘చౌమెహల్లా ప్యాలెస్’..
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీదారుల అందాలతో చౌమెహల్లా ప్యాలెస్ మెరిసిపోయింది. మంగళవారం రాత్రి చౌమహల్లా ప్యాలెస్‌లో వారికి విందు ఏర్పాటు చేసింది రాష్ట్రప్రభుత్వం.

పసందైన హైదరాబాదీ వంటకాలతో ఇచ్చిన విందును వారందరూ ఆస్వాదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఇతర మంత్రులు, హీరో నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, హీరోయిన్ శ్రీలీల, పలువురు పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విందు సందర్భంగా పోటీదారులందరూ నృత్యాలు చేశారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌తో హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందని నాగార్జున అన్నారు. నేడు మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ నుండి రెండు టీమ్‌లుగా బయలుదేరి వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలను సందర్శించనున్నారు. ఈ ఈవెంట్‌లో మిస్ ఇండియా నందినీ గుప్తా, 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

