‘ఇడియట్’ అంటూ రామ్‌చరణ్‌ను భార్యముందే తిట్టిన చిరంజీవి
ఎంత ఎదిగినా తండ్రికి కొడుకు చిన్నపిల్లవాడిలాగే కనిపిస్తాడు. మెగా పవర్ స్టార్ అయినా, అంతర్జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్నా కూడా రామ్‌చరణ్ తండ్రి చేత తిట్లు తిన్నాడట. ఈ విషయం ఓ అంతర్జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు. అది కూడా తన భార్య ఉపాసన ముందే ఇడియట్ అంటూ తిట్టారట చిరంజీవి. ఒకరోజు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న చెర్రీని బరువు తగ్గినట్టున్నావు అన్నారట చిరు. అవును నాన్నా అన్న చరణ్‌తో ఇడియట్ నేను సరదాగా అన్నాను. జిమ్‌కు వెళ్లి ఎక్సర్ సైజులు చేయమని ఉపాసన ఎదురుగానే హెచ్చరించారట చిరంజీవి. దానితో ఉపాసన కాస్త నివ్వెరపోయిందట. నటులకు శరీర శ్రద్ధ చాలా అవసరం అని, డైట్ విషయంలో చిరంజీవి చాలా నిక్కచ్చిగా ఉంటారని తర్వాత ఉపాసనకు చెప్పారట చెర్రీ. ఈ మాటలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి RRR సినిమా రికార్డులు తిరగరాస్తూ, ఆస్కార్‌కు పరుగులు పెడుతోంది. మొన్నన్నే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకుంది. దీనితో చిత్ర యూనిట్ అంతా చాలా జోష్‌లో ఉన్నారు. చరణ్ రాబోయే చిత్రాలు శంకర్ దర్శకత్వంలోని ఆర్ సీ 15 మూవీ, బుచ్చిబాబు దర్శకత్వంలోని మూవీ, మరోరెండు పెద్దప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు రామ్‌చరణ్.