Home Page SliderTelangana

అల్లు అర్జున్‌ను విష్ చేసిన చిరంజీవి దంపతులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. బర్త్ డే విషెస్‌తో పాటు పుష్ప-2 టీజర్‌పై కూడా చిరు కాంప్లిమెంట్స్ అందజేశారు. టీజర్ చాలా బాగుందని, పుష్పరాజ్ మళ్ళీ రూల్ చేస్తాడని చిరు తెలిపారు. పుష్ప మూవీలో చిరంజీవి సాంగ్ రిఫరెన్స్‌ను పెట్టిన అల్లు అర్జున్, పుష్ప-2లో కూడా చిరంజీవికి ట్రిబ్యూట్ ప్లాన్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. తన మేనల్లుడు, నటుడు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిరంజీవి- సురేఖ దంపతులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. స్వీట్స్ తినిపించారు. చిరంజీవి విషెస్‌తో బన్నీ చాలా సంతోషించారు.