చిన్మయ్ కృష్ణదాస్‌కు దక్కని ఊరట..
ఇస్కాన్ ప్రచార కర్త చిన్మయ్ కృష్ణదాస్‌కు బంగ్లాదేశ్ కోర్టులో ఊరట దక్కలేదు. హిందువుల రక్షణ కోసం, హక్కుల కోసం పోరాడుతున్న సాధువుకు బెయిల్ ఇవ్వడానికి చిట్టగాంగ్ హైకోర్టు అంగీకరించలేదు. ఆయన తరపున సుప్రీంకోర్టు నుండి 11మంది లాయర్ల బృందం వాదనలు వినిపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోపక్క ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో హిందువులు ఆందోళన చెందుతున్నారు. దేశద్రోహం కేసులో ఆయనను కొన్ని నెలల కిందట బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలల క్రితం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆందోళనల కారణంగా ప్రభుత్వమే కూలిపోయింది. అప్పట్లో జరిగిన హత్యాకాండలు, హింస చెలరేగిన కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.