Home Page SliderInternational

బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో చైనా ఆటగాడి మృతి

ఈ రోజుల్లో మృత్యువు ఎవరిని ఎప్పుడు ఎలా కబళిస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.కాగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ఎంతోమంది చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు.అయితే తాజాగా బ్యాడ్మింటన్ ఆడుతూ 17 ఏళ్ల చైనా ఆటగాడు గుండెపోటుతో మరణించాడు. ఇండేనేషియాలో ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో టోర్నీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాగా ఆదివారం మ్యాచ్ ఆడుతున్న సమయంలో చైనా ప్లేయర్ జాంగ్ జిజీ(17) గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన అక్కడి సిబ్బంది అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జిజీ ప్రాణాలు కోల్పోయాడు.కాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. మరోవైపు జిజీ మృతితో టాలెంటెడ్ ప్లేయర్‌ను కోల్పోయామని బ్యాడ్మింటన్ ఆసియా ఓ ప్రకటనలో వెల్లడించింది.