Home Page SliderInternationalNewsPolitics

భారత సైన్యంలో చైనా డ్రోన్స్ కలకలం..

భారత సైనిక దళాల ఆయుధాల తయారీ, డ్రోన్ల తయారీ విడిభాగాల విషయంలో చైనాకు సంబంధించిన విడిభాగాలు ఉండడంతో  కేంద్రప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వీటిలో బీజింగ్ నుండి దిగుమతి చేసుకున్న పార్ట్స్ వాడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం కోట్ల విలువైన 3 కాంట్రాక్టులను రద్దు చేసుకుంది. సాయుధ దళాల రవాణా అవసరాల కోసం ఉద్దేశించిన 400 డ్రోన్లను ఆర్డర్ చేసింది. 2023లో చెన్నైకి చెందిన కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో రూ.230 కోట్ల విలువ గల 200 మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు ఉన్నాయి. వీటిని చైనాతో 3,488 కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధీన రేఖ వెంట మొహరించాలని ప్లాన్ చేసుకుంది. అయితే వాటిలో విడిభాగాలు చైనాకు సంబంధించినవి ఉండడంతో మండిపడింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. దీనివల్ల సైబర్ సెక్యూరిటీకి, డేటా రక్షణకు ముప్పుగా మారుతుందని, శత్రువులు జూమింగ్ సహాయంతో మన డ్రోన్లను సీజ్ చేయడం లేదా, సాఫ్ట్ కిల్ చేయగలుగుతారని పేర్కొంది. గతంలో చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లోని కొన్ని డ్రోన్లు విఫలమై అవి దారి మళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోయాయి. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో ఈ విషయం కనిపెట్టారు.