చేతులెత్తేసిన చైనా..కానీ దొంగచాటుగా..
భారత్- పాక్ ఉద్రిక్తలపై చైనా స్పందిస్తూ సంయమనం పాటించాలని పేర్కొంటోంది. భారత్-పాక్ మధ్య కల్పించుకోలేమని చేతులెత్తేసింది. కానీ పంజాబ్, జమ్మూలో పాకిస్తాన్ ప్రయోగించిన ప్రొజెక్టైల్స్ చైనాకు చెందినవిగా తెలుస్తోంది. చైనా మోడల్ పీఎల్-15 శకలాలు ఈ ప్రదేశాలలో బయటపడ్డాయి. దీనితో చైనా దొంగతనంగా పాక్‌కు ఆయుధ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రదాడులను పెంచి, పోషిస్తున్నట్లు ప్రపంచదేశాలన్నింటికీ తెలుసు. పాకిస్తాన్ మంత్రులు కూడా తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలున్నాయంటూ కొన్ని సందర్భాలలో పేర్కొన్నారు. బోర్డర్ దాటి భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను ఇప్పటికే బీఎస్‌ఎఫ్ మట్టుపెట్టింది. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత అప్రమత్తం చేసింది. ఢిల్లీ, హర్యానా, బెంగాల్‌లో రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది.

