చైనా ఒక ప్రావిన్సులో రోజుకు పది లక్షల కేసులు
చైనాలోని జెజియాంగ్, షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక ప్రావిన్స్‌లో రోజుకు పది లక్షల కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని స్థానిక అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నప్పటికీ, మరణాలు సంభవించలేదని చైనా వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రం పేర్కొంది. బీజింగ్ జీరో-COVID విధానానికి భారీ మార్పులు చేసిన తర్వాత కోవిడ్ విజృంభిస్తోంది. జాతీయ ఆరోగ్య కమిషన్ లక్షణరహిత ఇన్ఫెక్షన్‌లను నివేదించడం మానేయడంతో చైనా నుండి దేశవ్యాప్తంగా గణాంకాలు అసంపూర్ణంగా మారాయి. కేసులను ట్రాక్ చేయడం కష్టతరమవుతోంది. ఆదివారం కమీషన్ రోజువారీ గణాంకాలను నివేదించడం నిలిపివేసింది, దానిని చైనా CDC ప్రచురించింది. రోజువారీ కొత్త ఇన్‌ఫెక్షన్ సంఖ్య రెండు మిలియన్ల వరకు అంటే 20 లక్షల వరకు ఉంటుందని జెజియాంగ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరున్నర కోట్ల జనాభా కలిగిన జెజియాంగ్, ప్రావిన్స్‌లో జనం భారీగా ఆస్పత్రుల్లోకి క్యూ కడతున్నారు. COVID-కారణమైన న్యుమోనియా, లేదా శ్వాసకోశ వైఫల్యం నుండి వచ్చిన వాటిని మాత్రమే కరోనాగా లెక్కిస్తున్నారు.
