భీకర గాలులకు ఎగిరిపోయిన చిన్నారులు
దేశవ్యాప్తంగా వర్షాలు, ఈదురు గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ లో భీకర గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు సహా చిన్న పిల్లలు ఎగిరిపోయిన వీడియో షాక్ కు గురిచేస్తోంది. పైకప్పు కొట్టుకుపోకుండా పిల్లలు గట్టిగా పట్టుకున్నారు. కానీ గాలుల ఉద్ధృతికి పైకప్పు లేచిపోవడంతో వారు కూడా ఎగిరిపడ్డారు. అయితే పిల్లలు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

