Andhra Pradeshhome page sliderHome Page Slider

చిలకలూరిపేట బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు యువకుల దుర్మరణం

పల్నాడు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాదెండ్ల మండలం గణపవరం వద్ద నూతన బైపాస్‌ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు . వీరంతా ప్రకాశం జిల్లాకు చెందిన వారీగా ప్రాథమిక సమాచారం తెలిసింది . మృతులందరూ అయ్యప్పమాలధారణలో ఉన్న విజ్ఞాన్‌ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.