ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ జెండా ఆవిష్కరణ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. సచివాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని వేనోళ్ల కొనియాడారు.

