Home Page SliderTelangana

వచ్చే 16న కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి సమావేశం

హైదరాబాద్: ఈ నెల 16న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 9 అంశాలతో ఎజెండాను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం సీజనల్ కండిషన్స్, హెల్త్, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, లా అండ్ ఆర్డర్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్‌లపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు.